🌟 Master Tenses, Modal Verbs & Probabilities in Hindi!
నమస్కారం! ఈ పాఠంలో మనం మన రోజువారీ సంభాషణలలో తరచుగా ఉపయోగించే వివిధ కాలాలు (Tenses), బహుశా / ఉండొచ్చు అని చెప్పే వాక్యాలు (Probabilities), మరియు ఒక పనిని చేయగలగడం (Ability - सक / पा) గురించి స్పష్టంగా నేర్చుకుందాం. ఇంగ్లీష్, తెలుగు వివరణలతో పాటు హిందీ ఆడియో కూడా ఉంది కాబట్టి సులభంగా అర్థం చేసుకోవచ్చు!
1. Simple & Continuous Tenses (టీ తాగడం)
రోజువారీ పనులు, గతం, భవిష్యత్తు మరియు ప్రస్తుతం జరుగుతున్న పనులను హిందీలో ఎలా చెప్పాలో (Tea drinking examples) ఇక్కడ చూద్దాం.
| Telugu (తెలుగు) | Hindi (हिन्दी) | English |
|---|---|---|
నేను టీ తాగుతాను. | मैं चाय पीता हूँ। | I drink tea. (Masculine) |
నేను రేపు టీ తాగుతాను. | मैं कल चाय पीऊँगा। | I will drink tea tomorrow. (Masculine) |
నేను నిన్న టీ తాగాను. | मैंने कल चाय पी। | I drank tea yesterday. |
అతను ప్రతిరోజు టీ తాగుతాడు. | वह हर दिन चाय पीता है। | He drinks tea everyday. |
అతను ఇప్పుడు టీ తాగుతూ ఉన్నాడు. | वह अभी चाय पी रहा है। | He is drinking tea right now. |
అతను నిన్న టీ త్రాగాడు. | उसने कल चाय पी। | He drank tea yesterday. |
నేను టీ తాగుతూ ఉన్నాను. | मैं चाय पी रही हूँ। | I am drinking tea. (Feminine) |
నేను నిన్న టీ తాగుతున్నాను. | मैं कल चाय पी रही थी। | I was drinking tea yesterday. (Feminine) |
నేను రేపు టీ తాగుతూ ఉంటాను. | मैं कल चाय पी रही हूँगी। | I will be drinking tea tomorrow. (Feminine) |
2. Probability / Possibility (బహుశా / జరగవచ్చు)
ఒక పని జరిగి ఉండొచ్చు, జరుగుతూ ఉండొచ్చు అని ఊహించి చెప్పేటప్పుడు "शायद" (Shayad) ఉపయోగిస్తాము.
| Telugu (తెలుగు) | Hindi (हिन्दी) | English |
|---|---|---|
బహుశా అతను ప్రతిరోజు టీ తాగుతుంటాడు. | शायद वह हर दिन चाय पीता होगा। | Maybe he drinks tea everyday. |
బహుశా అతను ఇప్పుడు టీ తాగుతూ ఉంటాడు. | शायद वह अभी चाय पी रहा होगा। | Maybe he is drinking tea now. |
బహుశా అతను టీ త్రాగి ఉంటాడు. | शायद उसने चाय पी होगी। | Maybe he has drunk tea. |
3. Different Tenses (హిందీ మాట్లాడటం)
"बोलना" (మాట్లాడటం) అనే క్రియను వివిధ కాలాల్లో ఎలా వాడాలో చూద్దాం.
| Telugu (తెలుగు) | Hindi (हिन्दी) | English |
|---|---|---|
అతను హిందీ మాట్లాడతాడు. | वह हिंदी बोलता है। | He speaks Hindi. |
అతను రేపు హిందీ మాట్లాడతాడు. | वह कल हिंदी में बोलेगा। | He will speak in Hindi tomorrow. |
అతను నిన్న హిందీ మాట్లాడాడు. | वह कल हिंदी में बोला। | He spoke in Hindi yesterday. |
అతను ఇప్పుడు హిందీ మాట్లాడుతూ ఉన్నాడు. | वह अभी हिंदी में बोल रहा है। | He is speaking in Hindi now. |
అతను నిన్న హిందీ మాట్లాడుతూ ఉన్నాడు. | वह कल हिंदी में बोल रहा था। | He was speaking in Hindi yesterday. |
అతను రేపు హిందీ మాట్లాడుతూ ఉంటాడు. | वह कल हिंदी में बोल रहा होगा। | He will be speaking in Hindi tomorrow. |
4. Probability with Speaking (మాట్లాడే అవకాశం)
అతను మాట్లాడుతూ ఉండవచ్చు అని చెప్పడానికి ఈ వాక్యాలు వాడతాము.
| Telugu (తెలుగు) | Hindi (हिन्दी) | English |
|---|---|---|
బహుశా అతను హిందీ మాట్లాడతాడు. | शायद वह हिंदी बोलता होगा। | Maybe he speaks Hindi. |
బహుశా అతను హిందీ మాట్లాడుతూ ఉన్నాడు. | शायद वह अभी हिंदी में बोल रहा होगा। | Maybe he is speaking in Hindi right now. |
బహుశా అతను హిందీ మాట్లాడాడు. | शायद वह कल हिंदी में बोला होगा। | Maybe he spoke in Hindi yesterday. |
5. Ability - "Can" & "Able to" (గలగడం - सकనా / पाना)
ఒక పనిని "చేయగలను" (Capacity/Ability) అని చెప్పడానికి "सकना" (Sakna) మరియు "पाना" (Paana) వాడుతాము. ఇవి చాలా ముఖ్యమైన మోడల్ వర్బ్స్!
| Telugu (తెలుగు) | Hindi (हिन्दी) | English |
|---|---|---|
అతడు హిందీ మాట్లాడగలడు. | वह हिंदी बोल सकता है। | He can speak Hindi. |
అతడు హిందీ మాట్లాడగలిగే వాడు. | वह हिंदी बोल सकता था। | He could speak Hindi. |
అతను రేపు హిందీ మాట్లాడగలడు. | वह कल हिंदी में बोल सकेगा। | He will be able to speak in Hindi tomorrow. |
అతను నిన్న హిందీ మాట్లాడగలిగాడు. | वह कल हिंदी में बोल सका। | He was able to speak in Hindi yesterday. |
అతను ఇప్పుడు హిందీ మాట్లాడగలుగుతూ ఉన్నాడు. | वह अभी हिंदी में बोल पा रहा है। | He is able to speak in Hindi right now. |
అతను నిన్న హిందీ మాట్లాడగలుగుతూ ఉన్నాడు. | वह कल हिंदी में बोल पा रहा था। | He was able to speak in Hindi yesterday. |
అతను రేపు హిందీ మాట్లాడగలుగుతూ ఉంటాడు. | वह कल हिंदी में बोल पा रहा होगा। | He will be able to speak in Hindi tomorrow. |
6. Ability - Feminine Examples (కారు నడపడం)
ఆడవాళ్ళ గురించి చెప్పేటప్పుడు (Feminine) గలగడం అనే క్రియలు ఎలా మారుతాయో ఇక్కడ చూద్దాం.
| Telugu (తెలుగు) | Hindi (हिन्दी) | English |
|---|---|---|
ఆమె కారు నడపగలదు. | वह गाड़ी चला सकती है। | She can drive a car. |
ఆమె కారు నడపగలిగేది. | वह गाड़ी चला सकती थी। | She could drive a car. |
ఆమె రేపు కారు నడపగలుగుతుంది. | वह कल गाड़ी चला सकेगी। | She will be able to drive a car tomorrow. |
ఆమె నిన్న కారు నడపగలిగింది. | वह कल गाड़ी चला सकी। | She was able to drive a car yesterday. |
ఆమె ఇప్పుడు కార్ నడపగలుగుతూ ఉంది. | वह अभी कार चला पा रही है। | She is able to drive a car now. |
ఆమె నిన్న కారు నడపగలుగుతూ ఉంది. | वह कल कार चला पा रही थी। | She was able to drive a car yesterday. |
ఆమె రేపు కారు నడపగలుగుతూ ఉంటుంది. | वह कल गाड़ी चला पा रही होगी। | She will be able to drive a car tomorrow. |
7. Asking for Permission (అనుమతి అడగటం)
మనం ఎదుటివారి అనుమతి అడగడానికి (May I / Can I) "क्या मैं... सकता हूँ?" అని వాడుతాము.
| Telugu (తెలుగు) | Hindi (हिन्दी) | English |
|---|---|---|
నేను లోనికి రావచ్చా? | क्या मैं अंदर आ सकता हूँ? | Can I come inside? |
నేను బయటకు వెళ్లొచ్చా? | क्या मैं बाहर जा सकता हूँ? | Can I go outside? |
నేను ఈ భోజనం తినవచ్చా? | क्या मैं यह खाना खा सकता हूँ? | Can I eat this food? |
నేను ఇక్కడ కూర్చోవచ్చా? | क्या मैं यहाँ बैठ सकता हूँ? | Can I sit here? |
నేను మాట్లాడొచ్చా? | क्या मैं बोल सकता हूँ? | Can I speak? |
నేను ఒక ప్రశ్న అడగొచ్చా? | क्या मैं एक सवाल पूछ सकता हूँ? | Can I ask a question? |
8. Giving Permission (అనుమతి ఇవ్వడం)
ఎవరు అనుమతి అడిగినా వారికి "సరే చేయవచ్చు" అని చెప్పడానికి వాడే వాక్యాలు.
| Telugu (తెలుగు) | Hindi (हिन्दी) | English |
|---|---|---|
అవును మీరు లోనికి రావచ్చు. | हाँ, आप अंदर आ सकते हैं। | Yes, you can come inside. |
అలాగే మీరు బయటికి వెళ్ళొచ్చు. | हाँ, आप बाहर जा सकते हैं। | Yes, you can go outside. |
సరే మీరు తినొచ్చు. | हाँ, आप खा सकते हैं। | Yes, you can eat. |
హా మాట్లాడొచ్చు. | हाँ, आप बोल सकते हैं। | Yes, you can speak. |
అలాగే ప్రశ్న అడగొచ్చు. | हाँ, आप एक सवाल पूछ सकते हैं। | Yes, you can ask a question. |
9. Possibility (జరిగే అవకాశం - Might / May)
ఒక పని జరిగే అవకాశం ఉంది అని చెప్పడానికి (It might happen) కూడా మనం "सकता है" వాడుతాము.
| Telugu (తెలుగు) | Hindi (हिन्दी) | English |
|---|---|---|
సాయంత్రం వర్షం కురవచ్చు. | शाम को बारिश हो सकती है। | It may rain in the evening. |
నాన్నగారు రేపు బట్టలు కొనవచ్చు. | पिताजी कल कपड़े खरीद सकते हैं। | Father might buy clothes tomorrow. |
అమ్మ రేపు బిర్యానీ వండొచ్చు. | माँ कल बिरयानी पका सकती है। | Mother might cook biryani tomorrow. |
నువ్వు పాస్ అవ్వచ్చు. | तुम पास हो सकते हो। | You might pass. |
పరీక్షలో ఈ ప్రశ్న రావచ్చు. | परीक्षा में यह सवाल आ सकता है। | This question might come in the exam. |
💡 Note from VRR Tutorials:
గమనిక: ఈ వాక్యాలను బిగ్గరగా చదువుతూ ప్రాక్టీస్ చేయండి. ముఖ్యంగా బహుశా (शायद - Shayad) మరియు గలగడం (सकना / पाना - Sakna / Paana) ఎలా వాడాలో ఒకటికి రెండు సార్లు గమనించండి. ఏవైనా సందేహాలు ఉంటే కామెంట్ సెక్షన్ లో అడగగలరు!
Discussion & Doubts
No comments yet. Be the first to ask a question!
What else do you want to learn?
మీకు ఈ టాపిక్ కి సంబంధించి ఇంకేమైనా డైలాగ్స్ కావాలా? కింద అడగండి, మేము తప్పకుండా దాన్ని ఇక్కడ యాడ్ చేస్తాము. (Ask the Admin for more phrases in this topic!)